ఐబొమ్మ రవిని పొగిడిన నటుడు శివాజీ.. దుమారం రేపుతున్న కామెంట్స్! (వీడియో)

by Mallepaka Hamsa |

తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోనే ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను కూడా బ్లాక్ చేయించారు.

ఐబొమ్మ రవిని పొగిడిన నటుడు శివాజీ.. దుమారం రేపుతున్న కామెంట్స్! (వీడియో)
X

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోనే ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను కూడా బ్లాక్ చేయించారు. రెండు సంవత్సరాల క్రితమే పోలీసులకు పట్టుకోండి చూద్దాం అని సవాలు విసిరిన రవిని ఎట్టకేలకు పట్టుకుని దర్శకనిర్మాతలకు కాస్త ఊరటనిచ్చారు. సినిమాలు, ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న రవి వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి. ఐబొమ్మ సైట్‌లో చూస్తూ జనాలు థియేటర్స్‌కు కూడా వెళ్లడం లేదు. దీని వల్ల ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రవి(ravi)ని అరెస్ట్ చేయడంతో..అంతా సంతోషపడుతున్నారు. ప్రస్తుతం రవిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇందులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీంతో అవి తెలుసుకున్న వారందరూ ఆయనను చాలా దారుణంగా తిడుతున్నారు.

ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు శివాజీ(Shivaji), రవిపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ‘‘ఆ అబ్బాయి టాలెంటెడ్ అని విన్నాను. చాలా మంచి హ్యాకర్ అంట. వాడు దేశానికి ఉపయోగపడే వ్యక్తి. రవిని మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. ఇకనుంచి అయినా మారి దేశానికి ఉపయోగపడేలా తయారైతే బాగుంటుంది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మర్గమైన పని అయినప్పటికీ అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా అనిపిస్తుంది. ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టమ్‌లో వాడిని యూజ్ చేసుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. కానీ తెలిసీ తెలియని వయస్సు కచ్చితంగా ఏదో డబ్బులేనితనం ఇవన్నీ వెంటపడి అతని మైండ్‌లో అలాంటి ఆలోచన వచ్చేలా చేశాయి. అతను చాలామందిని ఇబ్బంది పెట్టాడు.

ఈ విషయం తనకు తెలియక చాలా మందికి ఉపయోగపడుతున్నా అనే అనుకున్నాడు. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. ఇకనుంచి అయినా మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ దేంట్లో ఉండదు. మనం మొబైల్‌లో చూసినా అంత మంచి అనుభవం కలగదు. ప్రపంచంలో అన్నింటికన్నా చీప్ సినిమా. ఒకవేళ ఆ చిత్రం బాగుంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక ఎంటర్‌టైన్‌మెంట్. మిస్సమ్మ, పాతాళ భైరవి మూవీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ శివాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అంత పెద్ద తప్పు చేసిన వాడిని శివాజీ పొగడటం చర్చనీయాంశంగా మారింది. ఇక నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

link

Next Story