- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యాంకర్ సుమను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఇతనే.. ఈయనకు ఇంత సీన్ ఉందా అనుకుంటారు..
దిశ, సినిమా: యాంకర్ సుమ అంటే మినిమం ఉంటది. ఏ సినిమా విడుదల కాబోతున్న ఆడియో లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్లకు ఈమె యాంకరింగ్ చేయాల్సిందే. ఇక స్టార్ హీరోలు అందరూ తను ప్రోగ్రామ్ చేస్తేనే బాగుంటుందని, ఇంటర్వ్యూలో తనతో మాత్రమే కంఫర్ట్ గా మాట్లడవచ్చని ఆమెనే ప్రిఫర్ చేస్తారు. ఒక టీవీ ప్రోగ్రామ్ ఆమె పేరు మీదే ఉందంటే అర్థం చేసుకోవచ్చు.. ఎంత గొప్ప స్టార్ సెలబ్రిటీ అనేది. అయితే ఇంత పేరున్నా.. ఆమె మరి తెలుగు అమ్మాయా అంటే అదీ కాదు. అచ్చమైన మలయాళీ కుట్టి. కానీ అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది.
మరి అలాంటి అమ్మాయికి ముందు ఛాన్స్ ఎవరు ఇచ్చి ఉంటారు? అనే సందేహం మీలో తలెత్తితిందా? ఈ ప్రశ్నకు సమాధానం 'f2' మూవీ ఫేం 'అంతేగా అంతేగా ' అంకుల్ ప్రదీప్. నటుడిగా, డైరెక్టర్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈయన.. సుమకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడు. ఈటీవీ ప్రభాకర్, ఉత్తేజ్ లాంటి గొప్ప గొప్ప నటులను పరిచయం చేసిన ఆయన.. తొలి తెలుగు సీరియల్ డైరెక్టర్ కూడా. నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆయన.. పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. కళామతల్లి సేవలో ఉంటున్నాడు.
Read More..