62 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో నటుడి పెళ్లి.. సోషల్ వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-01 03:55:09  IST  )

గత కొద్ది రోజుల నుంచి పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కార్తీక మాసం ఎంటర్ అవడంతో సామాన్యులతో పాటు సినితారలు సైతం శుభకార్యాలు చేసుకుంటున్నారు.

62 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో  నటుడి పెళ్లి.. సోషల్ వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కార్తీక మాసం ఎంటర్ అవడంతో సామాన్యులతో పాటు సినితారలు సైతం శుభకార్యాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తుంది. ఇటీవల నారా రోహిత్ పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అల్లు శిరీష్ కూడా నైనికతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ సెలబ్రిటీ జంటకు సంబంధించిన పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరి వయసు, పెళ్లిపై చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. వీరిద్దరి ఏజ్ ఎక్కువగా ఉండటంతో ఆ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ నటి మహిమా చౌదరి(Mahima Chaudhary), సంజయ్ మిశ్రా పెళ్లి దుస్తుల్లో కనిపించిన వీడియో హాట్‌టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఇద్దరు జంటగా ఫొటోకు పోజులివ్వడంతో పుకార్లు జోరందుకున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. సంజయ్ మిశ్రా(Sanjay Mishra) 62 ఏళ్ల వయసులో మహిమను పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘దుర్లభ్ ప్రసాద్ కీ దూస్రీ షాదీ’ (Durlabh Prasad Ki Dusri Shaadi)అనే మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వీరిద్దరు జంటగా కనిపించబోతున్నారట. అయితే ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. సంజయ్ మిశ్రా, మహిమ పెళ్లి దుస్తుల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లు టాక్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే ఇలా వధూవరుల్లా రెడీ అయ్యారు. అంతే తప్ప మహిమా, సంజయ్ పెళ్లి చేసుకోలేదు. ఇక ఈ విషయం తెలుసుకోవడంతో అంతా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story