నటన అంటే ఉద్యోగం కాదు.. ఇన్ని గంటలే పని చేస్తానంటే కష్టం.. దీపికాకు రానా కౌంటర్

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన అంశం సినీ సెలబ్రిటీల వర్కింగ్ అవర్స్.

నటన అంటే ఉద్యోగం కాదు.. ఇన్ని గంటలే పని చేస్తానంటే కష్టం.. దీపికాకు రానా కౌంటర్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన అంశం సినీ సెలబ్రిటీల వర్కింగ్ అవర్స్. ఇటీవల దీపికా పదుకొణె(Deepika Padukone) ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మాట్లాడి వివాదాస్పదమైంది. ఎన్నో ఏళ్లుగా హీరోలు 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారని తాము కూడా అలా చేస్తామని అంటోంది. సోషల్ మీడియాలో పని గంటల విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎంతోమంది ఈ విషయంపై స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. కొందరు నటీమణులు మాత్రం దీపికాకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఈ పనిగంటల షరతు కారణంగా దీపికాను భారీ ప్రాజెక్ట్స్ స్పిరిట్, కల్కి-2 వంటి సినిమాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ టాపిక్ కాస్త సంచలనంగా మారింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా దగ్గుబాటి(Rana Daggubati)కి ఈ ప్రశ్న ఎదురవగా.. ఆయన తనదైన స్టైల్లో స్పందించి దీపికా పదుకొణెకు కౌంటర్ వేశాడు. ‘‘నటన అంటే ఉద్యోగం కాదు. ఇది సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ దీన్ని జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఈ జీవనశైలి పాంటించాలా, వద్దా అనేది పూర్తిగా నటీనటుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 8గంటలపాటు కదలకుండా కూర్చొని పనిచేస్తే అద్భుతమైన అవుట్‌పుట్ రావడానికి యాక్టింగ్ అనేది ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ ప్రతి విభాగంలోనూ నటీనటులు భాగమైతేనే గొప్ప సన్నివేశాలను అద్భుతంగా సృష్టించవచ్చు. ఇన్ని గంటలే పని చేస్తానంటే కష్టం. ఇలాంటి ఉద్దేశం ఉంటే.. ఇండస్ట్రీలో రాణించలేం’’ అని చెప్పుకొచ్చారు.

Next Story