Prithviraj Sukumaran : 'సలార్' విలన్ పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్?

by Phanindra |   (  Updated:2023-06-26 07:37:28  IST  )

పృథ్వీరాజ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ‘సలార్’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకీ తెలిసిందే

Prithviraj Sukumaran : సలార్ విలన్ పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్?
X

దిశ, వెబ్ డెస్క్ : పృథ్వీరాజ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ‘సలార్’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకీ తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం హీరోగా మలయాళ చిత్రం ‘విలాయత్ బుద్ధ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో పృథ్వీరాజ్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. బస్సులో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు పృథ్వీరాజ్ జారిప‌డ్డారు.. కాలికి గాయ‌మైంది. గాయం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయన్ని వెంట‌నే ఆయ‌న్ని కేర‌ళ‌లోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. సోమవారం రోజున కాలికి డాక్ట‌ర్స్ ఆప‌రేష‌న్ కూడా నిర్వ‌హించ‌బోతున్నారు. రెండు నుంచి మూడు నెల‌లు పాటు పృథ్వీరాజ్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.

Read more : డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘సలార్’ టీజర్ రిలీజ్.. ఆ రోజే మంచి ముహూర్తం.. ధోనీతో ప్లాన్..

Click here for more Salaar Updates

Next Story