డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 7 |
డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే.. ఆ సినిమా అనంతరం వచ్చిన ప్రతీ సినిమా డిజాస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా కలెక్షన్లు వస్తున్నప్పటికి మిక్సిడ్ టాక్‌తో ఏదో అలా నడుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు వాళ్ల ఆశలన్నీ ‘సలార్‌’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్’ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ.. తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘సలార్ విట్ నెస్‌ను చూసేందుకు ఇంకా 100 రోజులు ఉందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దాంతో ట్విట్టర్లో హండ్రెడ్‌ డేస్‌ ఆఫ్ సలార్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా ప్రభాస్‌కు బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈచిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. అయితే ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీస్ కాబోతుందని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది మూవీ టీమ్. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story