తండ్రిని కాపీ చేసిన అబ్‌రామ్.. సిగ్నేచర్ పోస్ట్‌తో కౌగిలింతల్లో ముంచేశాడు..

by Disha Web Desk 10 |
తండ్రిని కాపీ చేసిన అబ్‌రామ్.. సిగ్నేచర్ పోస్ట్‌తో కౌగిలింతల్లో ముంచేశాడు..
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ కొడుకు అబ్‌రామ్ ఖాన్ నెటిజన్ల మనసు దోచేశాడు. ‘లైక్ ఫాదర్.. లైక్ సన్’ ప్రోవర్బ్‌కు హండ్రెడ్ పర్సె్ంట్ న్యాయం చేశాడు. స్కూల్‌ ఫెస్ట్‌లో స్కిట్ చేసిన ఈ జూనియర్ ఖాన్.. డైలాగ్ డెలివరీ, ఫ్లూయెన్సీ, కమాండ్‌తో షారుఖ్, గౌరీని ప్రౌడ్ పేరెంట్స్‌గా మార్చేశాడు. ఇక స్కిట్ ఎండింగ్‌లో షారుఖ్ ఐకానిక్ పోజ్‌ను రీక్రియేట్ చేయగా.. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగి పోయింది. ఇదే మూమెంట్‌ నెట్టింట కూడా వైరల్ అయిపోయింది. బాద్‌షా ఫ్యాన్స్‌ మరింత హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది. ‘ఫ్యూచర్ సూపర్ స్టార్’ అని అభిమానులు కొనియాడుతుంటే.. ‘అసలైన వారసుడు ఇతడే’, ‘అబ్‌రామ్ నీ సిస్టర్‌కు యాక్టింగ్ క్లాసులు చెప్పు’, ‘మినీ ఎస్‌ఆర్‌కే.. ఈ ఏజ్‌లో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంత బాగుంది’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed