- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100 మందిలో ఒక్కరు మాత్రమే చూడగలిగే హారర్ మూవీ.. దుష్టశక్తులు, మానసిక భయాలు.. మధ్యలోనే టీవీ ఆఫ్ చేయడం పక్కా..
వెరోనికా’ 2017లో రిలీజైన స్పానిష్ హారర్ ఫిల్మ్. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మూవీకి పాకో ప్లాజా దర్శకత్వం వహించగా.. హారర్ అభిమానులను గట్టిగానే పలకరించింది. 1991 మాడ్రిడ్‌లోని వల్లెకాస్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. సూర్య గ్రహణం సమయంలో ఓయిజా బోర్డ్ ఉపయోగించిన

దిశ, వెబ్ డెస్క్ : ‘వెరోనికా’ 2017లో రిలీజైన స్పానిష్ హారర్ ఫిల్మ్. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మూవీకి పాకో ప్లాజా దర్శకత్వం వహించగా.. హారర్ అభిమానులను గట్టిగానే పలకరించింది. 1991 మాడ్రిడ్‌లోని వల్లెకాస్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. సూర్య గ్రహణం సమయంలో ఓయిజా బోర్డ్ ఉపయోగించిన పదిహేనేళ్ల బాలిక చుట్టూ తిరుగుతుంది. వెంటాడే దుష్టశక్తులు, మానసిక భయాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ట్విస్టులు, సీన్లు ఆడియన్స్‌ను భయపెడుతాయి. కాగా ఈ సినిమాను ఒక్కరు కూర్చొని చూడటం అసాధ్యమని.. వంద మందిలో ఒక్కరు మాత్రమే ఒంటరిగా కూర్చుని సినిమాను పూర్తి చేయగలరనే వాదన ఉంది. ఇలాంటి వారికి సినిమా రిలీజైన కొత్తలో నెట్‌ఫ్లిక్స్ క్యాష్ ప్రైజ్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. సాండ్రా ఎస్కాసెనా నేచురల్ యాక్టింగ్, పోలీసు కేసులు ప్రేక్షకుడిపై భయంకర ప్రభావాన్ని చూపుతాయి.. కొద్ది రోజులు రాత్రి అయిందంటే వణుకు పుట్టి, నిద్ర పోవడం కూడా కష్టమవుతుందనే కామెంట్స్ వచ్చాయి.
రియల్ లైఫ్ స్టోరీ..
1990లో ఎస్టెఫానియా గుటిరెజ్ లాజారో అనే 18 ఏళ్ల అమ్మాయి.. స్కూల్‌లో స్నేహితులతో కలిసి ఓయిజా బోర్డ్ ఉపయోగించింది. తన స్నేహితురాలి మరణించిన లవర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో టీచర్ ఆ బోర్డును బ్రేక్ చేయగా.. ఒక రకమైన పొగ ఎస్టెఫానియా బాడీలోకి ప్రవేశించిందని చెప్తారు. ఆ తర్వాత నుంచి అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. మూర్ఛ, తనలో తాను మాట్లాడుకోవడం, ఉన్నది లేనట్లుగా భ్రాంతి చెందడం, అతీంద్రియ అనుభవాలు, ఇంట్లో వింత శబ్దాలు వినిపించడం జరిగింది. ఇలా ఆరు నెలలపాటు వింతగా ప్రవర్తించిన ఎస్టెఫానియా అనారోగ్యంతో హాస్పిటల్‌లో 1991లో మరణించింది. కానీ ఇందుకు గల కారణం వైద్యపరంగా గుర్తించబడలేదు.
ఆమె మరణం తర్వాత కూడా ఇంట్లో అతీంద్రియ కార్యకలాపాలు కొనసాగాయి. వస్తువులు కదలడం, వింత వింత శబ్దాలు, నీడలు కనిపించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు చెప్పారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసును 1992లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా జోస్ పెడ్రో నెగ్రి అనే అధికారి అతీంద్రియ సంఘటనలను గుర్తించినట్లు నివేదిక సమర్పించాడు. క్రూసిఫిక్స్ స్వయంగా తిరగడం, ఫోటో ఫ్రేమ్‌లో రక్తం లాంటి ద్రవం కనిపించడం వంటి సంఘటనలను పేర్కొన్నాడు.






