మారిన 'Butta Bomma' రిలీజ్ డేట్ .. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు

by Chukka Sudharani |   (  Updated:2023-01-21 13:24:13  IST  )

'బుట్టబొమ్మ' విడుదల తేదీ మారింది. జనవరి 26న విడుదల కావాల్సిన సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మారిన Butta Bomma రిలీజ్ డేట్ .. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు
X

దిశ, సినిమా : 'బుట్టబొమ్మ' విడుదల తేదీ మారింది. జనవరి 26న విడుదల కావాల్సిన సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. కొంచెం లేట్‌గా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామన్నారు.

కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు.

ఇవి కూడా చదవండి : మళ్లీ హ్యాక్ అయిన యాంకర్ Face Book .. అశ్లీల ఫొటోలతో హల్ చల్

Next Story