అమితాబ్‌పై షోలో కుల్లు జోకులు.. హద్దులు దాటొద్దన్న అభిషేక్

by Dishanational4 |
అమితాబ్‌పై షోలో కుల్లు జోకులు.. హద్దులు దాటొద్దన్న అభిషేక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌ ఓ టాక్ షోకు ఊహించని షాకిచ్చాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కూలెస్ట్, కామెస్ట్ యాక్టర్‌గా మంచి పేరున్న ఆయన.. తాజాగా తన తండ్రి అమితాబ్‌పై కుల్లు జోక్ వేయడంతో షో సెట్ నుంచి వాకౌట్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. విషయానికొస్తే.. అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతున్న టాక్‌ షో 'కేస్ తో బన్ తా హై'కు రితేశ్ దేశ్‌ముఖ్, కుష కపిల హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.

అయితే అభిషేక్‌ దీనికి గెస్ట్‌గా రాగా.. పరితోష్ త్రిపాఠి బిగ్ బీపై జోక్ వేశాడు. దీంతో కోపానికి లోనైన అభిషేక్.. 'నేను ఫూల్‌ని కాదు. కేవలం షోలో పాల్గొనడానికి వచ్చాను. తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. మీరు హద్దులు దాటుతున్నారు. నాపై జోక్స్ వేయండి. మా తండ్రిపై జోక్ వేస్తే నాకు నచ్చదు. వెంటనే షూటింగ్‌ని ఆపేయండి' అంటూ మేకర్స్‌ను కోరాడు. దీంతో షాక్ అయిన నిర్వహాకులు అభిషేక్‌కు ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా షూటింగ్‌ను మధ్యలోనే వదిలివేసి వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed