Aashiqui-3: కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా ఆ బ్యూటీ ఫిక్స్..

by Gugulothu.Kavitha |

బాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Sradha Kapoor), స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapoor) జంటగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ‘ఆషీకీ-2’(Aashiqui-2).

Aashiqui-3: కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా ఆ బ్యూటీ ఫిక్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Sradha Kapoor), స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapoor) జంటగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ‘ఆషీకీ-2’(Aashiqui-2). ఇక ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా 'ఆషీకీ-3'(Aashiqui-3) తెరకెక్కిస్తున్నారు. అయితే 2022లోనే ఈ చిత్రాన్ని ప్రకటించగా.. ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అయితే మొదటగా ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్(Karthik Aryan), త్రిప్తీ దిమ్రీ(Tripti Dimri)లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారట మేకర్స్. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి త్రిప్తి దిమ్రిని తొలగించిన సంగతి తెలిసిందే.

మేకర్స్ అనుకున్నంత రేంజ్‌లో ఈ భామ పర్ఫామ్ చేయకపోవడం, ఎమోషనల్ సీన్‌లో బాగా నిమగ్నం కాకపోవడం వంటి కారణాల వల్ల ఈ బ్యూటీని తొలగించినట్లు సమాచారం. అయితే తాజాగా హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శార్వరీ(Sharvari)ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ‘ఆషికీ-3’లో కార్తీక్ ఆర్యన్ సరసన ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి అనురాగ్‌ బసు(Anurag Basu) దర్శకత్వం వహించనున్నారు.

Next Story