కూతురితో రొమాన్స్ చేయడంపై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-02 13:01:07  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

కూతురితో రొమాన్స్ చేయడంపై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. జెనీలియా(Genelia) దేశ్‌ముఖ్ హీరోయిన్ నటించగా.. ఈ చిత్రాన్ని ప్రసన్న(Prasanna) దర్శకత్వంలో తెరకెక్కింది. దీనిని అపర్ణ పురోహిత్ నిర్మించగా.. గత నెల థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్, కూతురితో రొమాన్స్ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘దంగల్’ మూవీలో ఫాతిమా సనా షేక్ (Fatima Sana Sheikh)ఆయన కూతురి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వచ్చిన మూవీలో ఆమె హీరోయిన్‌గా ఆమిర్‌తో రొమాన్స్ చేసింది.

ఈ విషయం ఆయన మాట్లాడుతూ.. ‘‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ చేసే సమయంలో ఫాతిమాతో నాకు ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ సీన్స్ పెట్టాలనుకోవడం లేదని డైరెక్టర్ విజయ్ అన్నారు. తండ్రీకూతురిగా నటించారు కాబట్టి రొమాన్స్ చేస్తే ప్రేక్షకులు ఏ మాత్రం అంగీకరించరు అని అన్నాడు. దీంతో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, ఆలియా భట్ వంటి హీరోయిన్స్‌ను సంప్రదించాం. స్క్రిప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. దీంతో నేను ఫాతిమాను ఎంపిక చేయమని చెప్పాను. అప్పుడు డైరెక్టర్‌తో ప్రేక్షకుల ఏమీ తెలివి తక్కువ వాళ్లు కాదు.

నిజ జీవితంలో మేమిద్దరం తండ్రీకుమార్తెలం కాదని వారికి తెలుసు. కాబట్టి వాళ్లు ఏం తప్పుగా అనుకోరని అన్నాను. కానీ ఈ సినిమా ఊహించినంత మెప్పించలేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమిర్ ఖాన్‌ను దారుణంగా తిడుతున్నారు. ఒకసారి కూతురిగా చేసిన తర్వాత తిరిగి ప్రేయసిగా ఎలా నటిస్తారు? బాలీవుడ్ బుద్ధి చూపించావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story