- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aamir Khan: తెలుగు దర్శకుడితో ఆమిర్ ఖాన్ సినిమా..?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది త్వరలోనే ఓ తెలుగు దర్శకుడు

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది త్వరలోనే ఓ తెలుగు దర్శకుడు తో ఆమిర్ ఖాన్ సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీనిపై ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారట ఈ బాలీవుడ్ హీరో. ఇందులో భాగంగానే ఇప్పటికే కథ చర్చలు ముగిసాయని... స్టోరీ నచ్చడంతో హీరో ఆమిర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.
ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ముందుకు వచ్చాడని కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. ఒక సోషల్ మెసేజ్ కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు... ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వంశీ పైడిపల్లి. హిందీ భాషలో మొదట రూపొందించి ఆ తర్వాత తెలుగు, సమయంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






