- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aamir Khan: ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆమిర్ ఖాన్.. హిట్ డైరెక్టర్‌తో రెండు సినిమాలు కన్ఫార్మ్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఎస్ ప్రసన్న కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో జెనీలియా కీలక పాత్రలో నటిస్తోంది. దీనిని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీతో పాటు ఆమిర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాభారతం’(MahabharataM) లోనూ నటిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఆమిర్ ఖాన్ మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ హిరానీ(Raj Kumar Hirani) దర్శకత్వంలో మరోసారి వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఓ 10 స్క్రిప్టులు విన్న ఆమిర్ ఖాన్ ‘దాదాసాహెబ్ ఫాల్యే’జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అలాగే ‘పీకే’ కు సీక్వెల్ కూడా తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కూడా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం.






