ఎవరేమనుకున్నా ఐ డోంట్‌ కేర్‌.. 22 ఏళ్లకే పెళ్లిపై :Aaliyah Kashyap..

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-06-08 06:33:32  IST  )

అనురాగ్ కశ్యప్ కూతురు, నటి ఆలియా కశ్యప్ తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది.

ఎవరేమనుకున్నా ఐ డోంట్‌ కేర్‌.. 22 ఏళ్లకే పెళ్లిపై :Aaliyah Kashyap..
X

దిశ, సినిమా: అనురాగ్ కశ్యప్ కూతురు, నటి ఆలియా కశ్యప్ తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్‌ను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్టార్ కిడ్.. 22 సంవత్సరాలకే నిశ్చితార్థం చేసుకున్నందుకు ప్రజలు తనను దారుణంగా ద్వేషించారని చెప్పింది. ‘నేను నెగెటీవ్ కామెంట్స్ ఎప్పటికీ పట్టించుకోను. నా మనసులో షేన్ గ్రెగోయిర్ పట్ల ఎలాంటి సందేహం లేదు. నేను పెళ్లి చేసుకునేవాడు అతనే. అలాగే చిన్నతనంలోనే ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ చేసుకోవడం పట్ల ప్రజలు అసహ్యించుకుంటే నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో నాకు పనిలేదు. వాటన్నింటినీ నేను లెక్కచేయను’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టేసింది.

Click here for Aaliyah Kashyap Instagram link

Also Read; Mia Khalifa :అన్నీ చూపించి ఊరిస్తున్న మియా ఖలీఫా.. నదిలో తేలుతున్న అందాలు ఆస్వాదించాల్సిందే..

Next Story