పోలీసులను ఆశ్రయించిన ఆదిపురుష్ రచయిత

by Seetharam |
పోలీసులను ఆశ్రయించిన ఆదిపురుష్ రచయిత
X

దిశ,వెబ్‌డెస్క్: ఆదిపురుష్ సినిమా విడుదలైన నాటినుంచి సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా విడుదలై మూడురోజులు అవుతున్నా ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లా తనకు ప్రాణహాని ఉందనీ.. తనను రక్షించాలని పోలీసులను ఆశ్రయించాడు. ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సంచలనం అవుతోంది.

ఓ వైపు సినిమాపై విమర్శలు వస్తున్నా.. వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రానికి రచయిత మనోజ్ శుక్లా.. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకెళ్తోంది. మెుదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు సైతం.. బాక్సాఫీసు దగ్గర చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టింది.

Also Read,,

‘Adipurush ’ దిమ్మతిరిగే కలెక్షన్స్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్

Next Story

Most Viewed