- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ స్టార్ హీరో నన్ను బెదిరించాడు.. షాకింగ్ విషయాలు చెప్పిన మీనా
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించి ప్రస్తుతం అత్త, పిన్ని, అమ్మ,వదిన పాత్రలో మెప్పిస్తున్న వారిలో మీనా (Meena)ఒకరు.

దిశ, సినిమా: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించి ప్రస్తుతం అత్త, పిన్ని, అమ్మ,వదిన పాత్రలో మెప్పిస్తున్న వారిలో మీనా (Meena)ఒకరు. తెలుగులో తోప్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఒకప్పటి స్టార్స్‌తో నటించి ఎవర్ గ్రీన్ హీరోయిన్‌గా పాపులారిటీ దక్కించుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. ఈసమయంలోనే తన భర్త మరణించడంతో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. కానీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, తనను ఓ స్టార్ హీరో బెదిరించాడని మీనా షాకింగ్ విషయాలు చెప్పింది.
నేను షూటింగ్‌లో చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరితో కలిసి నటించా.. అందరూ నాతో సరదాగా ఉండేవారని చెప్పింది. అలాగే బాలకృష్ణగారు సెట్‌లో అందరితో సరదాగా ఉంటారని.. కానీ మోహన్ బాబు(Mohan Babu) మాత్రం తనను బెదిరించేవాడని షాకింగ్ విషయం చెప్పింది.అందుకే ఆయనతో సినిమా చేసేటప్పుడు అస్సలు మాట్లాడేదాన్ని కాదని సరదాగా చెప్పింది. అంత సీరియస్‌గా కనిపించినప్పటికీ సరదాగా ఉండేవారని చెప్పింది. షూటింగ్ సమయంలో ఆయన పిల్లలతో ఆడుకున్నట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం మీనా కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అసలు మోహన్ బాబు ఏ విషయం గురించి మీనాను బెదిరించాడా? అని అంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






