- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బైకర్’ సినిమాలో టాలీవుడ్ హీరో కీ రోల్.. పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేసిన మూవీ టీమ్
అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara)దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’(Biker).

దిశ, సినిమా: అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara)దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’(Biker). 1990- 2000 కాలం నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శర్వానంద్ బైకర్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉండి అంచనాలను పెంచేసింది. ‘బైకర్’ అంటే కేవలం రేసింగ్ యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉండబోతోంది. మూడు తరాలకు చెందిన వ్యక్తులు ఒకే రేసింగ్ కల కోసం ఎలా పోరాడారు? వారి మధ్య ఉండే ఎమోషనల్ బంధాలు ఏంటి? అన్న కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. స్పీడ్, అంబిషన్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో కూడిన ఒక మల్టీ జనరేషనల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రాజశేఖర్ ఇందులో ‘బుల్లెట్ సునీల్’ అనే మాజీ రేసర్ పాత్రలో కనిపిస్తున్నారు. వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై రఫ్ అండ్ టఫ్ మేకోవర్‌లో ఉన్న రాజశేఖర్‌ను చూస్తుంటే పాత వింటేజ్ యాంగ్రీ మ్యాన్ గుర్తొస్తున్నారు. ఇది కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదు, కథను పూర్తిగా మలుపు తిప్పే కీలక పాత్ర అని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ వంటి నేచురల్ యాక్టర్‌తో రాజశేఖర్ వంటి సీనియర్ స్టార్ తోడవ్వడంతో ‘బైకర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్పీడ్ చూపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






