టాక్సిక్’ సినిమాలో నదియాగా స్టార్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-21 07:41:26  IST  )

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’(Toxic).

టాక్సిక్’ సినిమాలో నదియాగా స్టార్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’(Toxic). వరుస హిట్స్ సాధిస్తున్న కన్నడ స్టార్ యశ్(yash) హీరోగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్(Geetu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై యశ్, వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ అంచనాలను రెట్టింపు చేశాయి.

తాజాగా, మూవీ మేకర్స్ మరో అప్డేట్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి కియారా అద్వానీ (Kiara Advani)పాత్రను సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ‘నదియా’ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా పూర్తిగా ఇంటెన్స్, రాయల్ లుక్‌లో కన్పించింది. బంగారు అలంకరణలు, మిస్టీరియస్ స్టైల్, శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ ఆమె పాత్రను మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను పెంచుతోంది.

సినిమాలో నదియా పాత్ర చాలా కీలకమని సమాచారం. కథలో యశ్ పాత్రతో నదియా క్యారెక్టర్‌కు ఘాటైన కనెక్షన్ ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. కియారా ఇంతకుముందెన్నడూ చేయని డిఫరెంట్ షేడ్స్‌తో ఈ పాత్రలో కనిపించబోతుందనే ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు స‌రికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నదియా పాత్ర‌లో కియారా చేసిన న‌ట‌న డిఫ‌రెంట్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో క‌నిపిస్తుంది. ఆమె పెర్ఫామెన్స్ చూసి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్ర‌యాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మ‌కం పెట్టుకుని, మ‌నస్ఫూర్తిగా ఆమె స‌పోర్ట్ చేసిన‌ తీరుకి ధ‌న్యావాదాలు’’ అన్నారు. ఈ అప్‌డేట్‌తో కియారా ఫ్యాన్స్ కూడా భారీగా ఎగ్జైట్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది. అలాగే అద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఉగాది కానుకగా.. మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story