నిశ్శబ్దం వెనుక భారీ శబ్దం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-13 13:32:59  IST  )

నిశ్శబ్దం పెరిగేకొద్ది.. అంతటి ధ్వని రాబోతోంది’’ అనే అదిరిపోయే క్యాప్షన్‌తో తారక్ ఫిజిక్‌ను చూపిస్తూ వదిలిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నిశ్శబ్దం వెనుక భారీ శబ్దం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షెడ్యూల్ రద్దయిందని, షూటింగ్ ఆలస్యం అవుతోందని వస్తున్న వార్తలు అభిమానులను కాస్త కంగారు పెట్టాయి. మూవీ ఆగిపోయిందనే వార్తలను చిత్ర నిర్మాతలు గట్టిగా ఖండించారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పవర్ ఫుల్ షర్ట్ లెస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నిశ్శబ్దం పెరిగేకొద్ది.. అంతటి ధ్వని రాబోతోంది’’ అనే అదిరిపోయే క్యాప్షన్‌తో తారక్ ఫిజిక్‌ను చూపిస్తూ వదిలిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

విశాలమైన భుజాలు, సన్నని నడుముతో పక్కా ‘వి-టేపర్’ ఫిజిక్‌లో తారక్ కనిపిస్తున్నారు. క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజులో ఆయన చేతులు, భుజాలు చాలా పదునుగా, దృఢంగా కనిపిస్తున్నాయి. ‘డ్రాగన్’ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని, ఆ పాత్ర కోసం తారక్ కఠోరమైన జిమ్ వర్కౌట్లు, కఠినమైన డైట్ పాటిస్తున్నారని ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. కేవలం ఈ పవర్ ఫుల్ బాడీ మేకోవర్ కోసమే షూటింగ్ షెడ్యూల్‌కు చిన్న గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో మనకు తెలిసిందే. అందుకే నీల్ విజన్‌కు తగ్గట్టుగా తారక్ తనను తాను చెక్కుకుంటున్నారు. ఈ ఒక్క ఫోటోతో డ్రాగన్ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Next Story