'Avatar 2'కి షాకింగ్ ఓపెనింగ్..

by Disha Web Desk 10 |
Avatar 2కి షాకింగ్ ఓపెనింగ్..
X

దిశ, సినిమా: సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవతార్ 2' వచ్చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొత్తం160 భాషల్లో విడుదలైన ఈ సినిమాకి రికార్డు స్థాయిలో స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సినీ లవర్స్ కోసం ఓ థియేటర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. లార్జ్‌ స్క్రీన్‌పై స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ సౌకర్యంతో 'అవతార్‌ 2'ను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం బ్యాడ్ న్యూస్ ఎమిటంటే..దేశంలోని థియేటర్లలో విడుదలకు ముందే 'అవతార్ 2' మూవీ ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటం‌తో కొందరు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి అద్భుతమైన చిత్రం థియేటర్లలో చూస్తేనే మజా అనుకుంటున్నారు సినీ ప్రియులు. అందుకే నెట్టింట సినిమా లీకైనా థియేటర్లలో బుకింగ్ ఏమాత్రం తగ్గకుండా భారీగానే నమోదైనట్లు తెలుస్తోంది.

Also Read....

'Pathan' సినిమా వివాదంపై Prakash Raj రీయాక్షన్ ఇదే..


Next Story

Most Viewed