- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు పాన్ ఇండియా సినిమాలో ఆలియా భట్‌కు పవర్ ఫుల్ పాత్ర..?
ఆలియా భట్ తెలుగు పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గతేడాది ‘జిగ్రా’ వంటి సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘అల్ఫా’ అనే పవర్‌ఫుల్ స్పై థ్రిల్లర్‌లో నటిస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఈ మొదటి ఫిమేల్ లీడ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్ప ఈ సినిమా జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆలియా భట్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తెలుగు పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఎన్టీఆర్-నీల్’ (డ్రాగన్) సినిమాలో ఆలియా భట్‌ను ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం సంప్రదించారట. ఇందులో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నప్పటికీ, ఆలియా కోసం ఒక కీలకమైన, కథను మలుపు తిప్పే పాత్రను నీల్ డిజైన్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఆలియా, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉండటంతో ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆలియా ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ‘అల్ఫా’తో బాలీవుడ్‌ను, ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్‌ను ఆలియా ఏలేయడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు బాలీవుడ్‌లో ‘లవ్ అండ్ వార్’, ‘జీ లే జరా’ వంటి సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి సౌత్ ఇండియన్ పాన్ ఇండియా సినిమాల్లో భాగమవ్వడం ఆలియా క్రేజ్‌ను మరింత పెంచుతోంది.






