‘పెద్ది’ సినిమా నుంచి స్టార్ నటుడి పోస్టర్ విడుదల.. ఈ పాత్ర స్ట్రాంగ్‌గా ఉండనుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పెద్ది’(peddi).

‘పెద్ది’ సినిమా నుంచి స్టార్ నటుడి పోస్టర్ విడుదల.. ఈ పాత్ర స్ట్రాంగ్‌గా ఉండనుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పెద్ది’(peddi). ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి స్టార్ నటుడి పోస్టర్ షేర్ చేశారు. ఇందులో జగపతి బాబు(Jagapathi Babu) ‘‘అప్పలసూరి’’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ.. ఆయన ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో జగపతి బాబు ముసలాయనలా గుర్తు పట్టలేకుండా కనిపించాడు. ‘‘శక్తివంతమైన, ప్రభావవంతమైన పాత్రలో ఆయన అద్భుతమైన నటనను చూడటానికి సిద్ధంగా ఉండండి.

అప్పలసూరి పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసి అందరిలో ఆసక్తిని పెంచారు. కాగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌ను రాబట్టడంతో పాటు ప్రేక్షకులను మెప్పించాయి.

link

Next Story