పెళ్లి పనులు మొదలుపెట్టిన కొత్త జంట.. అందరిముందే స్టార్ సింగర్ చిలిపి చేష్టలు

by Mallepaka Hamsa |

కార్తీకమాసం రావడంతో సినీ ఇండస్ట్రీలో వరుస శుభకార్యాలు మొదలయ్యాయి.

పెళ్లి పనులు మొదలుపెట్టిన కొత్త జంట.. అందరిముందే స్టార్ సింగర్ చిలిపి చేష్టలు
X

దిశ, సినిమా: కార్తీకమాసం రావడంతో సినీ ఇండస్ట్రీలో వరుస శుభకార్యాలు మొదలయ్యాయి. అక్టోబర్ చివరి వారంలో సెలబ్రిటీలు కొందరు బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఈ నెల చివర్లో జరగబోతున్న విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిర లేల్ల పెళ్లి అక్టోబర్ 30న జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలవ్వగా.. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’పాటతో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. త్వరలోనే బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఇటీవల తన ప్రేయణి హరిణ్య(Harinya)తో నిశ్చితార్థం కూడా జరుపుకున్న రాహుల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలైనట్లు తెలుపుతూ.. హరిష్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇందులో లగ్నపత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ మూడు ఫొటోలు పెట్టగా.. ఇందులో రాహుల్, హరిణ్య జంట పసుపు దంచుతున్నట్లుగా ఫొటోలకు పోజులిచ్చారు. అలాగే రాహుల్, హరిణ్య చెంప ముద్దు పెడుతూ, జడ లాగుతూ చిలిపి చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story