- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్య బాలరాముడి తరహాలోనే చిరంజీవి ఇంట్లో వింత.. హనుమజ్జయంతి వేళ ఎమోషనల్ పోస్ట్
ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మా పూజా మందిరంలోని హనుమంతుడి విగ్రహంపై సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.

దిశ, సినిమా: హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు, ప్రజలందరికీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంట్లోని పూజా మందిరంలో చోటుచేసుకున్న ఒక అత్యంత అద్భుతమైన, ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. సూర్య కిరణాలు నేరుగా వచ్చి హనుమంతుడి విగ్రహాన్ని తాకుతున్న ఆ దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మా పూజా మందిరంలోని హనుమంతుడి విగ్రహంపై సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సప్త వర్ణాలుగా మారిన ఆ కిరణాలు స్వామివారిని పై నుంచి కింది వరకు స్పృశిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు మా ఇలవేల్పు హనుమంతుడిని ఇలా అభిషేకిస్తున్నట్లు ఉండటం చూస్తుంటే ఎంతో పరవశంగా అనిపిస్తుంది" అని పేర్కొన్నారు.ఈ అద్భుతాన్ని ఆయన అయోధ్యలోని బాలరాముడి సూర్య తిలకంతో పోల్చారు. ఇటీవల అయోధ్య రామాలయంలో రామనవమి రోజున సూర్య కిరణాలు బాలరాముడి నుదిటిని తాకిన అద్భుతాన్ని మనం చూశామని, అలాగే కోణార్క్, అరసవిల్లి వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలాంటి విశేషాలు జరుగుతుంటాయని గుర్తు చేశారు. అచ్చం అలాంటి దైవానుభూతి తన ఇంట్లో కూడా కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరంజీవి ఎంతో భక్తితో రాసుకొచ్చారు. భక్తులందరికీ హనుమజ్జయంతి శుభం చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.






