- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో రూ.2 లక్షలు పెట్టి ‘అఖండ-2’ టికెట్ కొన్న వ్యక్తి.. ఇదేం అభిమానం బాబోయ్ అంటున్న నెటిజన్లు
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)అభిమానులు మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)అభిమానులు మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2). బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో భారీ హైప్ నెలకొంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘అఖండ-2’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ వ్యూస్‌ను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో అప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ‘అఖండ-2’చిత్రానికి విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘అఖండ-2’ ఒక్క టికెట్‌ను ఓ అభిమాని ఏకంగా లక్షలు పోసి కొనుగోలు చేసి సంచలనానికి తెరలేపాడు. అఖండ-2 జర్మనీలో తారకరామ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. అయితే ఈ సంస్థ అద్వర్యంలో ‘అఖండ-2’టికెట్‌ను వేలం నిర్వహించారు. ఇందులో ఎంతోమంది పోటీ పడగా.. అత్యంత ఎక్కువ ధరకు బిడ్ వేసి.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ అభిమాని ఏకంగా రూ. 2లక్షలకు అఖండ-2 టికెట్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా ఏ సీనియర్ హీరోకి లేని అతి పెద్ద ఆఫర్ బాలయ్యకు రావడంతో అభిమాని రికార్డు సృష్టించారు.
ఈ విషయంపై అతను సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను బాలయ్య అభిమానిని. నా గ్రామం, సీమ ఆంధ్ర రుచులను నేను ఇక్కడ అనుభవిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అనంతపురంలో, బాలకృష్ణ సినిమా విడుదలను కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి జరుపుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఏమీ కోల్పోనట్లు నాకు అనిపిస్తుంది. నందమూరి కుటుంబ సభ్యుడిగా, ఈ టికెట్ కొన్నందుకు నేను గర్వంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది తెలుసుకున్న నెటిజన్లు బాబోయ్ ఇదేం అభిమానం.. మరీ అంత డబ్బు పెట్టి కొనలా? అని పలు రకాలుగా స్పందిస్తున్నారు.






