- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాస్ ఏ మ్యాన్’ (If Middle Finger Was a Man)అని రాసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ జూలై 9న రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు (Ravikanth Perepu)దర్శకత్వం వహిస్తుండగా.. ‘బ్యాడాస్’(Badass) టైటిల్‌తో రాబోతున్నట్లు టాక్. ఈ సినిమా సినీ పరిశ్రమ గురించి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బోల్డ్‌గా ఉండనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






