- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టాక్సిక్’ సినిమాలో హాట్ బ్యూటీ ఫిక్స్.. పోస్టర్ విడుదల చేసి షాకిచ్చిన యశ్!
కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్’(Toxic) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. యశ్ కెరీర్‌లో 19వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. దీనికి నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యశ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది పండుగ కానుకగా విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్ అన్ని ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేయడంతో పాటు ఆసక్తిని పెంచాయి. తాజాగా, యశ్ ‘టాక్సిక్’ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ఇందులో హుమా ఖురేషీ(Huma Qureshi) ‘ఎలిజబెత్’ పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ఇక ఇందులో హుమా ఖురేషి బ్లాక్ గౌన్‌లో ఇంటెన్స్ లుక్‌తో బ్లాక్ కలర్ కారు పక్కన నిల్చొని.. కనిపించింది. అంతేకాకుండా వెనకాల ఓ బొమ్మ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అలాగే కొందరు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఇందులో ఇంకెంత మంది హీరోయిన్లు నటిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.






