- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మిరాయ్ నటుడు మృతి
నేపాలీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటుడు సునీల్ థాపా(Sunil Thapa) (68)గుండెపోటుతో కన్నుమూశారు.

దిశ, సినిమా: నేపాలీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటుడు సునీల్ థాపా(Sunil Thapa) (68)గుండెపోటుతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కాఠ్మండులోని థాపథలిలో ఉన్న నార్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1981లో ‘ఏక్ దూజే కే లియే’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, బాలీవుడ్ చిత్రం ‘మేరీ కోమ్’లో ప్రియాంక చోప్రా కోచ్‌గా నటించి భారతీయ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఇక తెలుగులో తేజ సజ్జా పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’లో ఆయన కీలక పాత్ర నటించి మెప్పించారు. కాగా.. సునీల్ థాపా మరణం పట్ల ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ‘‘ప్రముఖ కళాకారుడు, గొప్ప మానవతావాది అయిన సునీల్ థాపా గారి మరణం మాకు తీరని లోటు. మిరాయ్ చిత్రంతో ఆయన మా బృందంతో పంచుకున్న అనుబంధం మరువలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము’’ అని పేర్కొంది. ఇక ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






