- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు గుండెపోటు వచ్చిందని వారికే అర్థం కాకముందే మరణిస్తున్నారు. కానీ కొందరిని మాత్రం పక్కనున్న వారు జాగ్రత్త పడి బతికిస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఇటీవల చాలామంది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంజాబీ నటుడు బాడీ, బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్ (Varinder Singh Guman)మరణించాడు. ఇటీవల ఆయనకు ప్రమాదవశాత్తు ఓ గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో అమృత్‌సర్‌లోని ఫార్టిస్ ఆస్పత్రికి వెళ్లిన వరీందర్ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.
దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వరీందర్ చివరగా.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘టైగర్-3’ సినిమాలో పాకిస్తాన్ జైలు గార్డు షకీల్ పాత్రలో కనిపించి మెప్పించాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక వరీందర్ విషయానికొస్తే.. ఆయన పలు సినిమాల్లో నటించడంతో పాటు ఛాంపియన్ బాడీబిల్డర్ కూడా 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకొని అందరి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా మిస్టర్ ఆసియాలో రన్నరప్‌గా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌తో పాటు సినిమాల్లోనూ పలు కీలక పాత్రలో నటించి తనదైన ముద్ర వేశాడు.






