ప్రేక్షకులను నవ్వించాలని చేసిన సినిమా.. మిమ్మల్ని ‘ఫంకీ’ నిరాశపరచదు.

by Mallepaka Hamsa |

మా నమ్మకం నిజమై ‘ఫంకీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ప్రేక్షకులను నవ్వించాలని చేసిన సినిమా.. మిమ్మల్ని ‘ఫంకీ’ నిరాశపరచదు.
X

దిశ, సినిమా: ప్రేమికుల దినోత్సవం కానుకగా నేడు(ఫిబ్రవరి 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫంకీ' (Funky)చిత్రం, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో.. చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా.. విశ్వక్ సేన్ (Vishwak Sen)మాట్లాడుతూ.."సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. కానీ నేను ఫంకీ విడుదలకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఉదయం శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. అందరూ థియేటర్ లో ఎంతగానో ఎంజాయ్ చేశారు. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా అనుదీప్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫంకీ చిత్రం నాకెంతో ఊరటనిచ్చింది. అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినీ ప్రయాణంలో ఫంకీ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అన్నారు.

దర్శకుడు అనుదీప్ కె.వి.(Anudeep K.V.) మాట్లాడుతూ.."కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ఉద్దేశంతో 'ఫంకీ' సినిమా చేశాము. ఇందులో కామెడీతో పాటు ప్రేమ కథ, భావోద్వేగాలు కూడా బాగా పండాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.."ఫంకీ సినిమా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుందని ముందు నుంచీ చెబుతూ వచ్చాము. మా నమ్మకం నిజమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఆ విషయంలో మేము విజయం సాధించాము. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫోన్ చేసి సినిమా బాగుంది అన్నారు. కామెడీ బాగుంది, అలాగే సెకండ్ హాఫ్ లో మదర్ ఎమోషన్ పండిందని చెబుతున్నారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్ళి, సినిమా చూడండి. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నవ్వుకోడానికి థియేటర్ కి రండి.. అసలు నిరాశపరచదు." అన్నారు.

Next Story