- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక కల నెరవేరింది నా జీవితంలో మర్చిపోలేను.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అందరికీ సుపరిచితమే. ఆమె ఇండస్ట్రీలో లేనప్పటికీ అపోలో హాస్పిటల్ చూసుకుంటూ జనాల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అందరికీ సుపరిచితమే. ఆమె ఇండస్ట్రీలో లేనప్పటికీ అపోలో హాస్పిటల్ చూసుకుంటూ జనాల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇటీవల ఉపాసన తన తాత, నాన్నమ్మతో, కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రత్యేక పూజలు చేసి అక్కడ కొంత సమయాన్ని గడిపి వచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా కోడలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ నా కోరిక తీరింది. ఒక కల నెరవేరింది. నా జీవితంలో మర్చిపోలేని ప్రయాణంలో ఇది ఒకటి. ఓ అధ్బుతమైన అనుభూతినిచ్చింది’’ అంటూ రాసుకొచ్చింది. ఇక అది చూసిన వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉపాసన తన కూతురు క్లీన్ కారాను చూసుకుంటూనే అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటుంది. అంతేకాకుండా కాలీ సమయాల్లో కూతురు, భర్త రామ్ చరణ్‌తో కలిసి పలు ట్రిపులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.






