ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. అందమైన అమ్మాయిని నిర్మాతకు ఎరగావేసిన డైరెక్టర్! సీన్ కట్ చేస్తే..

by Bhoopathi Nagaiah |

సినీ ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కౌచ్‌కు పెట్టింది పేరు. ఇక్కడ టాలెంట్ కంటే అందాలు ఆరబోస్తూ కమిట్ మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారనే అపవాదు దశాబ్దాలుగా ఉన్నది.

ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. అందమైన అమ్మాయిని నిర్మాతకు ఎరగావేసిన డైరెక్టర్! సీన్ కట్ చేస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కౌచ్‌కు పెట్టింది పేరు. ఇక్కడ టాలెంట్ కంటే అందాలు ఆరబోస్తూ కమిట్ మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారనే అపవాదు దశాబ్దాలుగా ఉన్నది. దీనినే రుజువు చేసేలా ఓ డైరెక్టర్ వేసిన ఎత్తుగడ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి నిర్మాత నుంచి భారీగా డబ్బులు గుంజాలని వేసిన ప్లాన్ బెడిసికొట్టి కటకటాల పాలయ్యాడు ఈ కన్నింగ్ డైరెక్టర్. బెంగళూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

‘బారబాత్’ మూవీతో దర్శకుడిగా పరిచమయ్యాడు రవీంద్ర. ఆయనకు చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర చిత్రాల నిర్మాత మహదేవ్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని సినిమాల నిర్మాణానికి ఉపయోగించుకోని రవీంద్ర.. కన్నింగ్ ప్లాన్ చేసి నిర్మాత నుంచి భారీగా డబ్బులు గుంజాలని చూశాడు. ఇందులో భాగంగా అందమైన అమ్మాయిలతో నిర్మాత మహదేవ్‌కు వలపుల ఎర వేశాడు. వారి ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలతో బెదిరించి డబ్బులు లాగాలని ప్రయత్నించాడు. రవీంద్ర ప్రవర్తనపై అనుమానం వచ్చిన నిర్మాత మహదేవ్ బెంగళూరు నగర పడటి విభాగం పోలీసులను ఆశ్రయించాడు.

అమ్మాయిలు తనపై వలపుల వల వేశారని, దానికి చిక్కిన తను ఇబ్బందులు పడుతున్నానని, డైరెక్టర్ రవీంద్ర పాత్ర ఇందులో ఉన్నదని అనుమానిస్తూ మహదేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు క్రైం సినిమా లెవల్లో ట్విస్టులు కనిపించాయి. అందమైన అమ్మాయిలను ఉపయోగించుకుని, వారి ద్వారా నిర్మాతను బ్లాక్ మెయిల్ చేసింది డైరెక్టర్ రవీంద్ర అని తేలింది. వెంటనే అతడిని అరెస్ట్ చేయడంతోపాటు సహకరించిన అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని, మరిన్ని విషయాలను త్వరలో తెలియజేస్తామని నగర సీపీ వెల్లడించారు. కాగా, డైరెక్టర్ రవీంద్ర చేసిన పాడుపనితో సినీ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడంతోపాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలను సైతం కుదిపేస్తోంది.

Next Story