- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)లేటు వయసులోనూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు.

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)లేటు వయసులోనూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇటీవల మమ్ముట్టి నటించిన చిత్రం ‘కలం కవల్’(Kalam Kaval). క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు జితిన్ జోస్ (Jithin Jose)దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వినాయకన్, గిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా విజయన్, శ్రుతి రామచంద్రన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇందులో మెగాస్టార్ మమ్ముట్టి సైకో పాత్రలో నటించడం గమనార్హం.
డిసెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నెలరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. తాజాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కానీ తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ వీకెండ్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే.. జనవరి 2న లేదా జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.






