- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘యూత్’ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, తెలుగు యువతను కూడా విశేషంగా ఆకట్టుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’ . ప్రముఖ నటుడు కరుణాస్ తనయుడు కెన్ కరుణాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, హీరోగా కూడా తనదైన నటనతో మెప్పించారు. ఇందులో అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేశ్ కీలక పాత్రలో నటించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిన్న సినిమాగా విడుదలై, కేవలం మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. నేటి కాలంలో యువత ప్రేమ, స్నేహం మరియు బాధ్యతల మధ్య ఎలా నలిగిపోతున్నారనే అంశాన్ని ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారు. కథ విషయానికొస్తే.. హీరో కెన్ కరుణాస్ ఒక సాదాసీదా యువకుడిగా కనిపిస్తారు.
ఆయన చుట్టూ అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేశ్ పాత్రలు తిరుగుతుంటాయి. మన ప్రేమకు ఇదెలాంటి పరీక్ష అనే క్యాప్షన్ సూచించినట్లే.. ఈ సినిమాలో ప్రేమలో వచ్చే ఒడిదుడుకులు, నమ్మకద్రోహాలు, అపార్ధాల చుట్టూ ఆసక్తికరమైన డ్రామా సాగుతుంది. కేవలం రొమాంటిక్ ఎంటర్టైనర్‌గానే కాకుండా, తప్పు చేసిన యువత మళ్ళీ ఎలా గాడిలో పడతారు? సమాజంలో వారు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? అనే పాయింట్‌ను ఆసక్తికరంగా చూపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అంతేకాకుండా స్ట్రీమింగ్ తేదీపై అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా.. ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.






