నిరీక్షణ ముగిసింది.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-02 10:34:49  IST  )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’).

నిరీక్షణ ముగిసింది.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(ManaShankaraVaraPrasadGaru ). ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ జోరు పెంచారు. నిత్యం అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ట్రైలర్ విడుదలపై అధికారిక అప్డేట్ ఇవ్వడంతో అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు నీరిక్షణ ముగిసిందంటూ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ జనవరి 4న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కోర్ట్‌లో మెగాస్టార్ భారీ ఫైట్ చేస్తూ గన్‌తో విలన్స్‌ను కాల్చి పడేస్తున్న పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ..

ట్రైలర్‌లో చిరంజీవి కనిపించే ప్రతి ఫ్రేమ్ మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని టాక్. శంకర వరప్రసాద్ పాత్రలో ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ప్రత్యేక హైలైట్‌గా ఉండనుందని మేకర్స్ అంటున్నారు. మొత్తంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, పండుగ సీజన్‌లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందనే నమ్మకం ట్రైలర్ ముందే కలిగిస్తోంది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌పై చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తోంది. భీమ్స్ సీసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మూడు పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

link

Next Story