‘టాక్సిక్’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఆయన మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 12:00:16  IST  )

సినీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యష్ ఫస్ట్ సినిమా టాక్సిక్ లుక్‌పై డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ క్లారిటీ ఇచ్చింది. జనవరి 8న యష్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు ప్రకటిస్తూ అభిమానుల ఎదురుచూపులకు చెక్ పెట్టింది.

‘టాక్సిక్’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఆయన మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’(Toxic: A Fairytale for Grown-Ups)పై అంచనాలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతూ మోహన్ దాస్(Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, యష్ కెరీర్‌లోనే డిఫరెంట్ జానర్ మూవీగా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. మేకర్స్ విడుదల చేస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ లైనప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాడియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజిబెత్ క్యారెక్టర్‌లో హుమా ఖురేషి, గంగ రోల్‌లో నయనతార, రెబెకా పాత్రలో తారా సుతారియా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వీరి లుక్స్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఇటీవలే మెలిస్సా పాత్రలో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేయడం ద్వారా హైప్ రెట్టింపు అయింది. ఇక అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యష్ ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ క్లారిటీ ఇచ్చింది. జనవరి 8న యష్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు ప్రకటిస్తూ అభిమానుల ఎదురుచూపులకు చెక్ పెట్టింది.

అలాగే ఆమె విడుదల చేసిన పోస్టర్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. చుట్టూరా మంటలు చెలరేగుతుండగా, బ్లాక్ డ్రెస్‌లో గన్ పట్టుకుని మంటల మధ్య నుంచి యష్ నడుచుకుంటూ వస్తున్న ఫైరింగ్ లుక్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఈ లుక్‌లో యష్ హెచ్చరిక ఇవ్వడానికి వచ్చినట్లుగా కనిపించడంతో.. ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ‘టాక్సిక్’ అంటే కేవలం టైటిల్ మాత్రమే కాదు.. యష్ క్యారెక్టర్ కూడా అంతే డేంజరస్‌గా ఉండబోతోందని ఈ విజువల్‌తో గీతూ మోహన్ దాస్ స్ట్రాంగ్ హింట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కాబోతుంది.

Next Story