ప్రముఖ యువ పాప్ సింగర్ సూసైడ్..!

by Disha Web Desk 9 |
ప్రముఖ యువ పాప్ సింగర్ సూసైడ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియన్ సింగర్ హెసూ (29) ఆత్మహత్య చేసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే మంచి సింగర్‌గా పేరు సంపాదించుకున్న ఆమె హోటల్ రూంలో విగతజీవిగా కనిపించారు. వివరాల్లోకెళ్తే.. ట్రాట్ (కొరియన్ మ్యూజిక్‌లో ప్రముఖ విభాగం) సింగర్ హెసూ బలవన్మరణంతో ముందుగా ప్రకటించిన కార్యక్రమానికి హాజరుకావడం లేదని నిర్వాహకులు తెలుపడంతో తన విషాదం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తులో సూసైడ్ నోట్ లభించడంతో మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. 2019లో ఆమె ‘మై లైఫ్, మి అనే సింగిల్ ఆల్భంతో కెరీర్‌ను ప్రారంభించారు. గయో స్టేజ్, హ్యాంగవుట్ విత్ యూ, ది ట్రాట్ షో వంటి ఆల్బమ్స్‌తో గొప్ప పేరు తెచ్చుకున్నారు. హెసూ మరణించే ముందు రోజు కూడా సోషల్ మీడియాలో రోజూలాగానే తన ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ యువ సింగ్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆమె ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు

Next Story