పాట పాడుతూ స్టేజి పైనే మరణించిన 27 ఏళ్ల రాపర్..(వీడియో)

by Disha Web Desk 12 |
పాట పాడుతూ స్టేజి పైనే మరణించిన 27 ఏళ్ల రాపర్..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికాకు చెందిన రాపర్ కోస్టా టిచ్.. స్టేజిపై పాట పాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జోహన్నెస్‌బర్గ్‌లో అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్ చోటు చేసుకుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో 27 ఏళ్ల రాపర్ కోస్టా టిచ్.. అకస్మాత్తుగా వేదికపై పడిపోయాడు.. అతని సిబ్బంది లేపగా మరో చరణం పాడి ఒక్కసారిగా కుప్పకూలి పోవడం వీడియోలో కనిపించింది.

అలాగే అతని సిబ్బంది వచ్చి రాపర్ ను ఎంత లేపిన లేవకపోవడంతో అత్యవసర సిబ్బందితో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాపర్ కోస్టా టిచ్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. కాగా ప్రస్తుతానికి అతని మరణానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అక్కడి పోలీసులు తెలిపారు.

Next Story