- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతన్న మూవీ ప్రమోషన్.. చౌటుప్పల్‌లో నారాయణ మూర్తి సందడి
by Shyam |
<p>దిశ, చౌటుప్పల్: రైతు సమస్యలను, బాధలను కళ్లకు కట్టేలా ‘రైతన్న’ సినిమాను రూపొందించామని సినీ హీరో, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంలను నారాయణ మూర్తి కలిసి, ‘రైతన్న’ సినిమా చూడాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేక, రైతులు చవిచూస్తోన్న నష్టాలను ‘రైతన్న’లో స్పష్టంగా […]</p>

X
దిశ, చౌటుప్పల్: రైతు సమస్యలను, బాధలను కళ్లకు కట్టేలా ‘రైతన్న’ సినిమాను రూపొందించామని సినీ హీరో, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంలను నారాయణ మూర్తి కలిసి, ‘రైతన్న’ సినిమా చూడాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేక, రైతులు చవిచూస్తోన్న నష్టాలను ‘రైతన్న’లో స్పష్టంగా చూపించామని తెలిపారు. దేశానికి వెన్నెముక రైతు అంటారని, అలాంటి రైతుల బాధలపై తీసిన సినిమాను అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా పలువురు కౌన్సిలర్లను కూడా కలిసి ‘రైతన్న’ చూడాలని కోరారు.
Next Story






