- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులు బీ అలర్ట్.. పొగమంచుతో జర భద్రం
<p>దిశ, డైనమిక్ బ్యూరో : చలికాలం వచ్చిందంటే చాలు.. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కప్పేస్తుంటుంది. ఈ పొగమంచు కారణంగా పది మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించదు. మిగతా సమయంలో అంతగా ఫాగ్ ఉండదు. కానీ చలికాలంలో డ్రైవింగ్ చేసేవారు ఫాగ్ లైట్లు వాడినా ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే ఈరోజుల్లో అధికంగా ప్రమాదాలు జరుతుంటాయి. ఈ సమయంలో వాహనానికి, వాహనానికి 20 నుంచి 30 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : చలికాలం వచ్చిందంటే చాలు.. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కప్పేస్తుంటుంది. ఈ పొగమంచు కారణంగా పది మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించదు. మిగతా సమయంలో అంతగా ఫాగ్ ఉండదు. కానీ చలికాలంలో డ్రైవింగ్ చేసేవారు ఫాగ్ లైట్లు వాడినా ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే ఈరోజుల్లో అధికంగా ప్రమాదాలు జరుతుంటాయి.
ఈ సమయంలో వాహనానికి, వాహనానికి 20 నుంచి 30 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా, ఓవర్ టేక్ చేయకపోవడమే మంచిది. కానీ, మహారాష్ట్రలోని ధూలేలో బిజాసాని ఘాట్ వద్ద ముంబై-ఆగ్రా హైవేపై బుధవారం రాత్రి ఓ వాహనం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. దీంతో వెనుక వచ్చే వాహనాలు ప్రమాదాన్ని గ్రహించకపోవడంతో ఒకదాని వెనుక మరొకటి ఇలా ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయని పోలీసులు వెల్లడించారు.






