- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతికున్న కొడుకును పాతిపెట్టిన తల్లి..!
<p>దిశ, వెబ్‌డెస్క్: నవ మాసాలు మోసి.. తను చావు అంచుల వరకు వెళ్లి మరీ బిడ్డలను కంటుంది తల్లి. పిల్లలకు చిన్న దెబ్బ తగిలిన తనకే గాయమైనట్టు తల్లడిల్లుతోంది. అలాంటి తల్లి.. అప్పుడే పుట్టిన మగ శిశువును సజీవంగా పాతిపెట్టి అమ్మతనానికే మచ్చ తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన చూపరులకు కన్నీటిని తెప్పించింది. ఎటపాక మండలం కృష్ణవరంలో గుర్తు తెలియని మహిళ గ్రామ శివారులో అప్పుడే పుట్టిన మగ శిశువును గుంత తీసి పూడ్చిపెట్టింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నవ మాసాలు మోసి.. తను చావు అంచుల వరకు వెళ్లి మరీ బిడ్డలను కంటుంది తల్లి. పిల్లలకు చిన్న దెబ్బ తగిలిన తనకే గాయమైనట్టు తల్లడిల్లుతోంది. అలాంటి తల్లి.. అప్పుడే పుట్టిన మగ శిశువును సజీవంగా పాతిపెట్టి అమ్మతనానికే మచ్చ తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన చూపరులకు కన్నీటిని తెప్పించింది.
ఎటపాక మండలం కృష్ణవరంలో గుర్తు తెలియని మహిళ గ్రామ శివారులో అప్పుడే పుట్టిన మగ శిశువును గుంత తీసి పూడ్చిపెట్టింది. ఇది గమనించిన స్థానికులు గుంతలో నుంచి శిశువును బయటకు తీసి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ విచారణకు ఆదేశించారు.
Next Story






