కన్నబిడ్డ పట్ల తల్లి రాక్షసత్వం.. చిత్ర హింసలకు గురిచేస్తూ వీడియోలు

by  |
Mother mercilessly beats
X

దిశ, వెబ్‌డెస్క్: రెండేళ్ల పసిబిడ్డపై ఓ తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని విల్లిపురం జిల్లా సత్యమంగళం మండలం మెట్టూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్టూరుకు చెందిన తులసి అనే మహిళకు రెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె టార్చర్ భరించలేక భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

ఆ కోపంతో కన్నబిడ్డను ఆ తల్లి చిత్రహింసలకు గురిచేస్తోంది. రోజూ విచక్షణా రహితంగా కొడుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించి వీడియోలు భర్తకు సెండ్ చేస్తోంది. అలా దాదాపు 250 వీడియోలు తీసి, బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తోన్న వీడియోలను భర్తకు పంపింది. దీంతో భర్త చేసేందేంలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన విషయం గ్రహించిన ఆమె పరారైంది. ప్రస్తుతం బాలుడు ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. నిందితురాలు తులసి కోసం పోలీసులు పది బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు.

Next Story

Most Viewed