‘అమ్మ’తనానికే మాయని మచ్చ ఈ ఘటన.. ప్రియుడితో కూతురిని ‘రేప్’ చేయించిన తల్లి..!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు మంట గలిసిపోతున్నాయి. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏకంగా వావి వరుసలు మర్చి ప్రవర్తిస్తున్నారు. కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కొన్ని సార్లు తమ పిల్లలపై కర్కశత్వానికి పాల్పడుతున్నారు. కొందరు తండ్రులు ఈ మధ్యకాలంలో తమ బిడ్డలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి రాగా, తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అమ్మ తనానికే మాయని మచ్చగా నిలిచిపోనుంది. ఓ మహిళ భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతనితో తన కూతురిని అత్యాచారం చేయించిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఔరంగాబాద్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల మహిళ తన భర్తకు దూరంగా ఉంటూ 52 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, 17 ఏళ్ల కూతురు కూడా తల్లితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే తల్లి తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సమయంలో ఆ వ్యక్తి మైనర్ బాలికపై కన్నేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలికి చెప్పడంతో ఆమె కూడా అతనికే సపోర్టు చేసింది. కన్న కూతురు అనే కనికరం లేకుండా తన స్వార్థాన్ని చూసుకుంది ఆ తల్లి.. దీంతో ఆ వ్యక్తి బలవంతంగా బాలికపై రెండు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వీరి నుంచి తప్పించుకోవాలని బాధితురాలు ప్రయత్నించగా, కసాయి తల్లి కూడా తన ప్రియుడు చెప్పినట్టు వినాలని కూతురిని బెదిరింపులకు గురిచేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కూతురికి రహస్యంగా పెళ్లి కూడా చేయాలని యత్నించింది. అయితే, ఈ క్రూరుల నుంచి ఎలాగోలా బయట పడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలికకు ట్రీట్మెంట్ ఇప్పించి వసతి గృహానికి పంపించిన ట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed