- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంటల వ్యవధిలో తల్లి కొడుకులు మృతి.. కారణం అదేనా..?
by Shyam |
<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలానిబాబా కాలనీలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో తల్లి కొడుకులు గంటల వ్యవధిలో మృతి చెందారు. మృతులిద్దరూ కరోనా లక్షణాలతో మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని తల్లి(80) కొడుకు(60) ఇద్దరు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే శుక్రవారం తెల్లవాఝామున 3 గంటల ప్రాంతంలో కొడుకు మృతి చెందగా మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని […]</p>

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలానిబాబా కాలనీలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో తల్లి కొడుకులు గంటల వ్యవధిలో మృతి చెందారు. మృతులిద్దరూ కరోనా లక్షణాలతో మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని తల్లి(80) కొడుకు(60) ఇద్దరు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
అయితే శుక్రవారం తెల్లవాఝామున 3 గంటల ప్రాంతంలో కొడుకు మృతి చెందగా మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికీ వచ్చేసరికి తల్లి కూడా మృతి చెందింది. దాంతో ఆ కుటుంబంతో పాటు కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తల్లికొడుకులు ఇద్దరు కరోనా లక్షణాలతో మృతి చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు మాత్రం ఇద్దరి మృతికి గల కారణాలను వెల్లడించలేదు.
Next Story






