- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొన్న తల్లి.. నేడు కొడుకు
<p>దిశ, దుబ్బాక: కరోనా ఒకే కుటుంబంలో ఇద్దరిని బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన తల్లీకొడుకు వైరస్ బారిన పడి మృతి చెందారు. పట్టణానికి చెందిన చీర్లంచ లచ్చవ్వ రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే అంత్యక్రియల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడంతో బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఆమె కొడుకు శ్రీనివాస్ (58) కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో 108 కు ఫోన్ చేశారు. అయితే సకాలంలో రాకపోవడంతో […]</p>

దిశ, దుబ్బాక: కరోనా ఒకే కుటుంబంలో ఇద్దరిని బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన తల్లీకొడుకు వైరస్ బారిన పడి మృతి చెందారు. పట్టణానికి చెందిన చీర్లంచ లచ్చవ్వ రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే అంత్యక్రియల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడంతో బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఆమె కొడుకు శ్రీనివాస్ (58) కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో 108 కు ఫోన్ చేశారు. అయితే సకాలంలో రాకపోవడంతో శ్రీనివాస్ చనిపోయాడు.
మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. మున్సిపల్ సిబ్బంది శవాన్ని ప్యాకింగ్ చేసి ఇంటిముందు పడేసి వెళ్లిపోయారు. మృతుని కుటుంబీకులు అందరూ క్వారంటన్‌కు వెళ్లడంతో సాయంత్రం ఐదు గంటల వరకు మృతదేహాం అక్కడే ఉంది. చుట్టుపక్కల వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చి అంబులెన్స్ ద్వారా తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.






