విషాదం.. వాగులో తల్లి ఇద్దరు పిల్లల గల్లంతు

by  |
ap-floods
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వాగు దాటుతుండగా తల్లి ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే దేవీపట్నం మండలం కొండ మెుదలు గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం సాయంత్రం రంపచోడవరం వెళ్లింది.

రంపచోడవరంలో ఈకేవైసీ అప్డేట్ చేయించుకుని తిరిగి ఇంటికి బయలు దేరింది. అయితే బడిగుంట-ఆకూరి మధ్య వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వాగు పొంగడంతో మహిళతో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఒకవైపు…స్థానికులు మరోవైపు గాలించగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం కూడా వారి ఆచూకీ కోసం పోలీసులు..స్థానికులు గాలిస్తున్నారు.


Next Story