ఊగిసలాట మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు..!

by Dishanational1 |
ఊగిసలాట మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు..!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. అంతకుముందు సెషన్‌లో నష్టాల నుంచి గురువారం ట్రేడింగ్‌లో కొంత కోలుకునే ప్రయత్నం చేసిన సూచీలు రోజంతా ఒడుదుడుకుల మధ్య కదలాడాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సరైన మద్దతు లేకపోవడ, దేశీయంగా జూన్ నెలకు సంబంధించి ఎఫ్అండ్ఓ గడువు ముగియడంతో వంటి పరిణామాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనివల్ల రోజంతా కూడా స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ర్యాలీ చేశాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల వల్ల సూచీలు పతనాన్ని ఎదుర్కొన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 8.03 పాయింట్లు క్షీణించి 53,018 వద్ద, నిఫ్టీ 18.85 పాయింట్లు పడిపోయి 15,780 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఐటీ, మెటల్ రంగాలు 1 శాతానికి పైగా నీరసించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం కంపెనీ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79 వద్ద ఉంది.

Next Story

Most Viewed