దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ అన్ని రకాల సేవలకు అంతరాయం!

by Dishanational1 |
దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ అన్ని రకాల సేవలకు అంతరాయం!
X

ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్న సమయం నుంచి అకస్మాత్తుగా ఎస్‌బీఐ అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమస్య వల్ల వినియోగదారులు నగదు బదిలీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్ సహా అన్ని సేవల్లో సమస్య్లు ఉత్పన్నమయ్యాయి. యూపీఐ చెల్లింపుల్లో కూడా ఇబ్బందులు ఎదురైనట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఎస్‌బీఐ యోనో యాప్ సైతం పనిచేయకుండా నిలిచిపోయింది.

యాప్‌ను వాడేందుకు ప్రయత్నించే వినియోగదారులకు మెయింటెనెన్స్ జరుగుతోందనే మెసేజ్ చూపిస్తోందని వారు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాల ద్వారా ఖాతాదారులు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఎస్‌బీఐ అధికారులు సమస్య పరిష్కారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంతసేపటికీ సేవల పునరుద్ధరణ జరుగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో వేతనాలు తీసుకునే ముందు ఇలాంటి సమస్య ఏర్పడటంతో ఎస్‌బీఐ ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Next Story