Enugu Movie: 'ఏనుగు'.. మంచి కంటెంట్ ఉన్న సినిమా

by S Gopi |   (  Updated:2022-06-30 13:21:27  IST  )

Arun Vijay's Enugu Movie to be released on July 1| కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, ప్రియా భవాని, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక, యోగి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏనుగు'. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాను సీహెచ్‌ సతీష్‌ కుమార్‌

Arun Vijays Enugu Movie to be released on July 1
X

దిశ, సినిమా : Arun Vijay's Enugu Movie to be released on July 1| కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, ప్రియా భవాని, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక, యోగి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏనుగు'. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాను సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మించగా హరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మీడియాతో ముచ్చటించిన మేకర్స్.. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అలరిస్తుందన్నారు. అంతేకాదు కుటుంబ సమేతంగా చూసేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హ్యాపీ ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకొస్తారని అభిప్రాయపడ్డారు. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ మేళవింపుగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

Next Story